Saturday, July 30, 2011

ఎందుకు భయం ?

నీ మనసులో మంచి ఉన్నప్పుడు, నీ మనసులో మంచి పని చేస్తున్నాను అనే నమ్మకం ఏర్పడినప్పుడు ( బయటి ప్రపంచపు జ్ఞానం సంపాదించటం వల్ల ) , ఆ పని చక్కబెట్టే పద్దతి తెలిసినప్పుడు ఎందుకు భయపడాలి ?

వంట చేసే పని (work), పద్దతి (behaviour/communication skills) తెలిసిన వ్యక్తి నిప్పుకి భయపడటం వల్ల ఉపయోగం ఉందా ?  

నష్టం జరుగుతుందనా ? శరీరానికా ? (భౌతిక ఆస్తుల కొరకా ?) అంటే మానసిక ఆస్తులను త్యాగం చేస్తున్నావా ?!
మనసు లేని శరీరం కోసం అన్నమాట నీ తాపత్రయం ! అది జరిగే పనేనా. 


భౌతిక సుఖాలు / మానసిక సుఖాలు ? 
రొండిటిలో ఏది మనకి తృప్తిని ఇచ్చేది ? ఏది మనశ్సాన్తి ఇచ్చేది ? 

అడుక్కున్నభౌతిక సుఖాలా ? సాధించుకున్నమానసిక సుఖాలా ? 
[ కొంత మంది చదువుకున్న మేధావి  నాయకులకు (మంత్రులకు) ఈ విశ్వజ్ఞానం (ప్రజా స్వామ్యం) చిప్ప కూడు పెడుతుందిలే, మరి వారికి అది ఏ సుఖమో ? ]   

ఆత్మలతో మనికి పెద్దగా touch లేదులే.
contact no's కానీ, mail id's, blog address తెలీదు మరి. 
ఎందుకో, ఏమో! 
Touch లో ఉండు Try చేస్తా అని కూడా ఏ ఆత్మ promise చెయ్యట్లేదు . ఇది నిజం .        

ఎందుకు జ్ఞానం, ఏంటి ఈ చదువు అని ప్రశ్నించుకోలేని వాడికి ఎందుకు భయం అని ప్రశ్నించుకునే సమయం ఉండదు పాపం !!!!

ఎవడే వీడు నన్ను చంపేస్తున్నడే.. ఒక మంచి పాట ! 

ధనమా ? దైవమా ? 
మనసా ? మైకమా ?
[ हम भी है जोश में बाते कर होश में ]

[ ఏదో ఒకటిలే, aal izz well కదా ? ]

జ్ఞానమే దైవం అనే నమ్మకం లేనివాడికి నేనొక వ్యర్దుడినే. అదే కదా నా కచ్చితమైన నమ్మకం.


చాదస్తం వయసుకే, మనసుకి కాదు. 


మనసా మన్నించమ్మా మార్గం చూపించమ్మా..  
శరీరం నువ్వెంత రా ? ఒక క్షణం... అల్ప సంతోషం, అల్ప దుఖం. 


మనసు పెట్టలేని పని శరీరం పెట్టగాలదా ? 
శరీరాన్ని శిక్షిస్తే అద్బుతాలు జరుగుతాయనే నమ్మకాలు ఉన్నాయంట,
అవి మూఢ నమ్మకాలని అంటున్నారంట !  

 శరీరాన్ని నేనే పోషించాలి, ఈ మనసునీ నేనే పోషించాలి, ఇదే కదా మన  సమస్య.


తల వంచుకుని చదువుకునేది తల ఎత్తుకుని జీవించడానికే.


[ As a teacher i can only give inputs, but can't promise outputs. I only played the role of a catalyst in the lives of people whom i belong to. Student's capability is always acclaimed.
I'm a student, its an awesome truth, cause i can share my feelings, if not... the exact truths ]

[ I neither am a pet to one nor pampered by one, i pamper my heart with the people in the newspaper,
 So Far So Near, So Near So Far. ]

Sunday, July 24, 2011

Youngisthan


Responsibility of youth in the society


To be  
         1. A harmless person in the society and
         2. A useful person in the society.


         1. A harmless person in the society:

            Not to do harm to others (neither to family members nor to people in the society)  
            by our words, actions, behavior.

           The way we dress and the way we drive vehicles should be done in a harmless way
            to others in the society.

            Already many different kinds of extremists are harming innocent people. We   
            realized at least we should be harmless.

            There is more to be done as part of civilization of human beings, to realize the    
            importance of fellow human beings in a person’s life.


            Any thing and everything one this planet ( knowledge, intelligence, engineering,   
            education, money etc ) is to make this life useful for self and other humanbeings.    
  
            After all a human being needs human beings only. No escape.

          2. A useful person in the society

             I can be a useful person in the society by loving my profession. It’s our Indian
             tradition to regard knowledge as Divine and that Work as worship. 
             My professional service benefits the society, my family and even me as an   
             individual.   


             Only through profession I can achieve both respect and money.
             When individuals, families and professional organizations are strong then   
              obviously the whole country will be a great place to live.
             
             “World requires professionals.”

Students views on corruption & politics


If a person has become a corrupt politician people allowed him to be corrupt. 
Means the citizens has not utilized their constitutional fundamental duty of selecting a right politician and fundamental right to ask for a better service from him.


In today’s complex world we are unable to get time to participate actively in democratic process. 
We should not ignore that democracy is govt. by the people. Unless and until citizens actively participate in the democracy we can’t have a better country.


From now onwards we make a pledge to pull some time for the country, because we can’t escape the price of ignorance.



Students views on cultural changes


Culture = the way of life, especially the general customs and beliefs, of a particular group of people at a particular time
 ex: youth/working-class culture
 ex: She's studying modern Japanese language and culture.

In this global village we ought to be a citizen of the world.


We have to respect any culture, but we need not imitate others cultures to be called fashionable.
We need not follow one particular culture when it’s not helping us to be happy or when it is not connecting to our rationale (called superstitions). 

In any generation, in any place on the entire planet only culture that is practical is Humanity.
We regard human beings as human beings only. Whatever connects to the rationale of a person he likes to follow that. We respect individual’s rights, freedom, in-line with societal implications.

Wednesday, July 20, 2011

Proud ?

If somebody can do more work than me or gain more money/people/things than me I feel good, I don’t feel jealous, I don’t feel pain. What is the meaning of proud, and where is the necessity to compare the happiness ? The happiness that any individual can feel and breathe is equal. Every one posses their own mind, body and intelligence.

I should have the capability to collect as much information that my body permits (Concentration).
I should integrate and Check whether that information is applicable to my heart’s desire (happiness) or not (Common Sense).
I should check whether the body’s inputs are healthy or not (food, water, air).

As the time passes whatever has to be gained those will be gained, and whatever has to be loosed those will be loosed - why to feel bad, upset, when everyone has things, people, and technologies to gain happiness, ah ?

Time will answer all my questions as I take pleasure in all the things that I posses. I am not suffering with identity crisis - that’s how I am happy. I am just a human being, like how a dog is – making lot of noise.

[ I am not asking others to understand me, but as a teacher I am open in my subject knowledge ]

Reduce the reasons to cry, improve the hope for happiness. What the hell is proud ? [A feeling that you are better and more important than other people]

We don’t have time to appreciate others, we don’t have time to greet others, we don’t have time to understand others, we don’t have time to feel this beauty of life. That’s how we are sick and broken.

The pain that I can undergo on this mother land is far much lesser than the pain that my mother underwent to bring me on to this planet and to bring me up to this extent. Believe it or not. 
The work we need to do to leave this body (deliberately) could be even hard when compared to the work that we need to do to achieve and share happiness. 

The enthusiasm is the key. 

Never loose it brother, sister.

Tuesday, July 19, 2011

I Am Not A Poor Student

This is what written by a student in her suicide note.

This is a fact.

No pakistani extremist group is claiming responsibility for this.

This is just the fate of Mother India, because of all education that indian's are rich about.

Feeling proud to be indian ? Feeling proud about indian cricket team ? Feeling proud about indian movie stars ? Feeling proud about somebody doing something for the country ?

Feeling proud about your bank balance ? Pakistani's are proud about their youngsters ready to bomb on india ? Let us see who will win ? Who are the loosers ?

Should we empower the Builders of Nation or not ? or should we loose our lives at the mercy of destroyers.

Wednesday, July 6, 2011

Formal Education

The application part of subjects is not immediately tangible, that is why we lack interest. 

Only at the examinations time it requires us to give the tangible results. So it gives ignition to initiation. 

So the classroom environment should be lively so that the learners can really participate in the learning process.

నమ్మకం

కొంత మందితో మాట్లాడితే మనమీద మనకు నమ్మకం పోతుంది, అలాంటి వారికి దూరంగా ఉండటం మేలు.

Tuesday, July 5, 2011

టైగర్ సత్తి


ఈ టైగర్  ది ట్రైన్ టైం. టైంకి రాడు వెయిట్ చెయ్యాలి.

అబ్బాబా ఈ బిల్డ్ అప్ చూడలేక చస్తున్నాం, వెళ్లి ప్రాక్టీసు మొదలు పెట్టండి.

కెప్టైన్ టీం కి వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు.

అవుట్ అవ్వాలి లేక పొతే చివరిదాకా ఆడాలి, అంత ఓపిక నాకు లేదు.


ఇన్ని బర్రెల్ని ఒకే సారి ఎందుకు అమ్ముతున్నావ్ ?
ఒక్కసారి అయితేనే అమ్మగలుగుత మల్లి మల్లి అమ్మలేను.
ఐనా ఆస్తి అనేది మనదగ్గరే ఉంచుకుంటే దాని విలువ తెలియదు, అందుకే అప్పుడప్పుడు అమ్ముతుండాలి.



A Teacher's Sentiment or Commitment


ఎవరి జీవితం వారిది, ఎవరి తాపత్రయం, తపన వారిది. 

అని నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, ఒక సూపర్ స్టార్ అనుకోవొచ్చు, ఒక అవకాశ రాజకీయ నాయకుడు అనుకోవొచ్చు.
కానీ అలా అనుకోలేని వారు మన జీవితంలో కొందరు ఉంటారు.

వారు ఎవరు ? 

నీ జీవితం నీది కాదు తనది, నీ ఆకలి దప్పికలు నీవి కావు తనవి, నీ ఆనందం నీది కాదు తనది, నీ అభివృధి నీది కాదు తనది అనుకునే వారు ఎవరు ?

ప్రజా స్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకో బడిన పాలన. అది నిరంకుశ పాలనకు అంతం. మానవత్వం లేని పాలకులకు అంతం.
మరి ఇప్పుడు ఉన్నా పాలకులకు మానవత్వం ఉన్నదా ? మానవత్వం అంటే, ప్రజా స్వామ్యం అంటే అర్ధం, విలువ ఉన్నాయా ?

వారు ప్రజల కొరకు తపన పడుతున్నారా ? మరి వారి తపన దేని గురించి ?

గుడ్డిగా నేను ఏ సూపర్ స్టార్ ని ఏ డూపర్ నాయకుణ్ణి అనుసరించను.
ఈ స్వతంత్ర భారత దేశంలో, ఈ ప్రపంచపు కుగ్రామంలో ( అత్యాధునిక సమాచార సాంకేతికతతో సాధికారమైన ) మనం శాంతిని, ఆనందాన్ని, అభివృధిని సాధించలేమా ?
వాటిని సాధిచుటకు సాటి మనుషులను హింసించాల్సినదేనా ? ఏమో !!

ఒక విద్యార్ధి అంటే రేపటి పౌరుడు, దేశ భవిష్యత్తు వాళ్ల చేతిలోనే ఉంటుంది - ఆ విద్యార్ధికే భవిష్యత్తు లేకుండా పోతే !!! - అతని కన్న తల్లిదండ్రుల పరిస్తితి ఏమిటి ? ఎంతో ఓపిక, సహనం, సమయం, ధనం వెచ్చించి - అన్నింటికన్నా విలువైన "ప్రేమను" పంచి, పెద్దది చేసిన దానికి విలువ ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి ?
ఉన్నదంతా ఊడ్చి, అమ్మి, తలతాకట్టు పెట్టి మనం బాగుండాలి అని కోరుకునే మన తల్లిదండ్రులకి మిగిలేది ఏమిటి ?

ఒక విద్యార్ధి తప్పు చేస్తే అది అతని తప్పు కాదు,
అతనికి ప్రేమను పంచివ్వని పెద్దల తప్పు,
ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేకం నేర్పించలేని వారి పెద్దల తప్పు.


ఒక మొక్కని పెంచి ఫలాలు ఇచ్చే చెట్టుని చెయ్యాలన్నా,
ఒక విద్యార్ధి పెరిగి ప్రయోజకుడు అవ్వాలన్నా వారి పెద్దలకు ఎంతో ఓర్పు నేర్పు అవసరం - చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం ఎంతో ఉంటుంది.

ఒక విద్యార్ధి కళ్ళల్లో ఉండే ఆశ, మనసులో ఉండే స్వచ్చత, జ్ఞాన తృష్ణ, సాధించాలనే పట్టుదల, తపన, ఉరకలేసే ఉత్సాహం నాకు ఎన్నో సార్లు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అలాంటి విద్యార్ధికి రేపు అనేది లేకుండా చేసే కారణం ఏదైనా కూడా భరించలేనిది - దేశ భవిష్యత్తు విద్యార్ధుల బుర్రలో ఉందన్న నిజం విస్మరిచలేనిది కాబట్టి.

సూపర్ స్టార్స్, డూపర్ రాజకీయ నాయకులు వాళ్ల కుటుంబం గురించే తపన పడుతుంటారు. మరి మనం ?

మన తల్లి దండ్రులు మనకి ఇచ్చిన ప్రేమను వారికి తిరిగి ఇచ్చే బాధ్యత మనకు లేదా ? ఊర్లో వాళ్ల కోసమా మన తాపత్రయం ?


15 ఏళ్ల క్రితం ఒక సారి నేను అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరి - నానా తంటాలు పడి చివరికి బతికి బట్ట కట్టిన తరువాత అనిపించింది - ఏమిటి ఈ జీవితం, ఏంటి ఈ దౌర్బాగ్యం అని ?
సరే మనకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం అని ఒక హిందూ మత ప్రభోదకుడి ఇంటికి వెళ్ళాను - వరుసగా రొండు రోజులు వెళ్లి మాట్లాడను - అతను చెప్పింది ఒక్కటి కూడా అర్ధం కాలా. కానీ ఒకటి మాత్రం అర్ధం అయింది - అతను తరవాత ఉదయం మా ఇంటికి వచ్చి నా గురించి వెటకారంగా మా నాన్నతో మాట్లాడి నవ్వుకుంటున్నారు.
క్రైస్తవ మత ప్రభోదకుల ఇంటికి కూడా వెళ్ళాను - చనిపోయిన తరవాత మనం స్వర్గానికి వెళ్తాం - అక్కడ అంతా బంగారంతో చేసిన వస్తువులు ఉంటాయి అనేది మాత్రం అర్ధం అయింది.

ఏది ఏమైనా, ఇతరులను హింసించు, అని మాత్రం ఏ మతం చెప్పడం లేదు అనేది మాత్రం బాగా అర్ధం అయ్యింది. మనం స్వర్గ సుఖాలు పొందాలంటే ఇంకొకరికి నరకం చూపించాలి అని ఏ దేవుడు చెప్పడం లేదు.

" 7 Habits of Highly Effective People - Stephen R Covey " అనే పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం అది నా కోసమే రాసారు, నా గురించే రాసారు అనిపించింది. చాలా బాగా అర్ధం అయింది.

"విజయానికి 5 మెట్లు - యండమూరి వీరేంద్రనాథ్" పుస్తకం చదవడం మొదలు పెట్టగానే ఒక ధ్యాన స్తితి లోకి వెళ్ళిపోయాను.


"A Good Book will substitute the lack of a Good Friend beside you" - Mahatma Gandhi


అందుకే అర్దిస్తున్నాచదువుకోండి, చదివించండి.


స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ అస్సలు లేదు కానీ

నేను ద్వేషిస్తున్నా, ద్వేషాన్ని, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నా, దేశాన్ని.

"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్."


తన బిడ్డ ఆనందంగా ఉండాలనే ఏ మాత ఐనా, భూమాత ఐనా కోరుకునేది.
గల్లి దాదా గాని, గిల్లే రాజకీయ నాయకుడు గాని అలా కోరుకోరు అని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
ప్రపంచం అనే కుగ్రామం (Global Village) దిశగా ఆధునిక ప్రపంచం ముందుకు పోతుంది,                                                   
మరి మనం ?

Sunday, July 3, 2011

అధ్యాపకుని ఆనందం

(Happiness of Teacher)


ఈ సమాజంలో ఒక అద్యాపకునికి చాలా పెద్ద బాద్యత ఉంది. 

ఒక కుటుంబంలో తల్లి, తండ్రికి ఆ కొద్ది సంతానం మీద ఉండే బాద్యత చాలా గొప్పది
అది ఇంకెవరూ కూడా బర్తీ చేయలేని, నిర్వహించలేని ఆనందకరమైన బాద్యత.

అలాగే ఈ ప్రపంచం అనే విశ్వ మానవ కుటుంబంలో అద్యాపకునికి కూడా జ్ఞానాన్ని ఆర్జించి, పంచే ఆనందకరమైన బాద్యత ఉంది.

ఎందుకంటే జ్ఞానమే దైవం; జ్ఞానమే జీవితాన్ని జీవింపజేస్తుంది కాబట్టి. బయటి ప్రపంచ జ్ఞానం కన్నా అంతర ప్రపంచ జ్ఞానం చాలా ముఖ్యం. ఒకరికి తీపి ఆనందాన్నిస్తే, ఇంకొకరికి కారం ఆనందాన్నిస్తుంది. బయటి ప్రపంచంలో ఎందులో తీపి ఉంటుందో ఎందులో కారం ఉంటుందో తెలుసుకోవడం మనం సంపాదించవలసిన జ్ఞానమే.

అజ్ఞానం జీవితాన్ని అంతం చేస్తుంది. నా అంతం నేను ఎన్నోసార్లు అనుభవించిన జ్ఞానంతో మాత్రమే ఈ విషయం అవగతమైంది.

కుతూహలం, ఉత్సాహం జ్ఞాన సముపార్జనకు ఇంధనం.
ఈ ఇంధనాన్ని సంపాదిస్తూ, నష్టపోకుండా కర్చు చేస్తూ జ్ఞానాన్ని ఆర్జించడమే ఈ జీవిత లక్ష్యం.


ఈ సమాజంలో అనుభవ జ్ఞానాన్ని పంచి, ఆనందాన్ని, జీవిత పరమార్ధాన్నిసాదించుటకు ఒక మనిషికి ఉన్న ఏకైక మార్గం మన యువ కెరటాలు.

వారు ఇచ్చే గౌరవం కల్మషమైన బుద్ది కర్మాగారాలు వెదజల్లే వాయువుల కన్నా స్వచ్ఛమైనది, సజీవమైనది.

ఒక అద్యాపకుడు తనకున్న పరిధిలో తన బాద్యత నిర్వర్తించడానికి విద్యార్దులు ఇచ్చే గౌరవం సరిపడా ఇంధనం ఇస్తుంది.

ప్లాస్టిక్ కవర్లను నిషేదిద్దాం, విద్యార్దుల ఉత్సాహాన్ని, జ్ఞాన తృష్ణని కాపాడుదాం, సంరక్షించుదాం, పెంచి వృద్ధి చేద్దాం.

ఎందుకంటే నేటి అధ్యాపకులు, నేటి తల్లిదండ్రులు జీవించవలసింది నేటి విద్యార్దులు సృష్టించబోయే రేపటి ప్రపంచంలోనే. 


ఈ సమాజంలో చెడ్డ వాళ్ళు వినాశనం చేస్తున్నారు అనుకున్నప్పుడు, మరి మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ?


నేను మంచి వాణ్ణి అనుకున్నప్పుడు సంఘ విద్రోహులు తప్ప మిగతా అందరూ మంచి వాళ్లేగా అని అనిపిస్తుంది. 
ఈ సమాజంలో ఉన్న మంచి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి. ఈ సమాజంలో ఉన్న చెడు నాలో వినాశనకారి ఆలోచనలు కలిగిస్తున్నాయి కాబట్టి.   

సంఘ విద్రోహులు అంత చక్కటి సమన్వయంతో అభివృద్ధి సాధిస్తున్నప్పుడు మరి మంచి వాళ్ళం అనుకునే వాళ్ళు ఇంకెంత సమన్వయంతో పని చేయాలి ? నేనొక్కడినే మంచి వాణ్ణి, నేనొక్కడినే పనితనం తెలిసినవాణ్ణి, మిగతా వాళ్లంతా  వృధా గాళ్ళు అనుకుంటే సమన్వయం సాధించగలమా ? ఏమో !!   

సంఘ విద్రోహ శక్తులను పాతి పెట్టే శక్తి లేకనే ఈ ఆశయం యొక్క ఈ ప్రయాస - ఇది ఒక నిజం. 

వాళ్ళు నా కొడుకులు కాదు. ఏ అజ్ఞానపు పేద తల్లి కన్న కొడుకులో మరి. తెలీదు.
ఈ అజ్ఞానమే మన శత్రువు. మనుషులు కాదు. ఇది ఒక నిజం.