Wednesday, January 18, 2012

మాట, పని

జీవితంలో ప్రతి మాటకి, పనికి  అర్ధం వెతుక్కోవాలని అనుకుంటున్నాను 
నా ప్రయత్నం ఇంకొకరికి ఇబ్బంది కలుగుజేస్తుందని అనుకోవట్లేదు.


నా జీవితం ఇంకొకరికి ఇబ్బంది కలుగాజేయాల్సి వస్తున్నందుకు చింతిస్తాను.

పుట్టగానే ప్రతి మనిషి ఏడుస్తాడు, చావడానికి ఇంకెంతో బాధ; జీవిత ప్రయాణం కూడా ఎంతో ప్రయాస, బాధ, ఎన్నో దుఃఖాలు, అవమానాలు, జీవితాన్నే ప్రశ్నించే నిరుత్సాహాలు.


మరి కని పెంచే తల్లి దండ్రులకు మనం ఆనందమో, బరువో, బాదో, విషాదమో,  సంకల్పమో!!!!!!!!... వాళ్ళయితే కచ్చితంగా ఇందుకు; అని చెప్పలేరు. 


కొంత మంది తల్లులు విసిరి పారేస్తున్నారు; బిడ్డలను, బట్టలను; మరి ఏ బాబా బక్తులో వారు. మనకెందుకు ద్వేషం, మసులో ప్రేమ అనేది ఉన్నపుడు. 

ఎందుకు బ్రతకాలో, ఎందుకు నిలబడాలో, ఎందుకు పరుగెత్తాలో, ఏమి ఆలోచించాలో, ఏమి ఆలోచించ కూడదో ఎలా తెలిసేది.

నాకు అర్ధం అయినంత వరకు ఇలా బ్రతకాలి అని మాత్రం కచ్చితంగా చెప్పగలను .
౧. ఇతరులకు ఇబ్బంది కలుగ జేయకుండా బ్రతకాలి 
౨  మన మాటలు , చేతలు ఇతరులకు ఉపయోగ పడే విధంగా ఉండాలి.

నా మాటలను చేతలను ఇతరులు మౌనంగా భరించాలని నేను కోరుకోవట్లేదు. నా వల్ల ఇతరులు ఆనందంగా ఉండగలరు అనే తృప్తి చివరి క్షణంలో అనుభవించాలనే పెద్ద స్వార్ధం. అంత కన్నా బరువైనవి, అబద్రతమైనవి ఈ మనసు మోయలేదు మరి. 



"ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పది రా" అని పాడుకోవడంలో వాస్తవం ఉంది.
ఎందుకంటే మనల్ని, మన తల్లి దండ్రులని ఎంతో కొంత కాపాడేది  ఈ సమాజంలోని మంచి మనుషులే. మనం కూడా ఈ సమాజంలో మంచిని కాపాడితే మన వాళ్ళు ఆనందంగా ఉంటారు అనే ఆశ, నమ్మకం ఏర్పడుతుంది.

"యువకుడు" సినిమాలో తల్లి పాత్రలోని జయసుధ చివరిగా తెలిసుకునే వాస్తవం - తన బిడ్డ తననే కాకుండా ఎంతో మంది తల్లులను వారి బిడ్డలను కాపాడే గొప్ప సైనికుడు అయ్యాడు అని, ప్రయోజకుడు అయ్యాడు అని. ఆ తల్లి ఆనందాన్ని, పుత్రోత్సాహాన్ని ఎలా వర్ణించగలం !?