Sunday, March 4, 2012

చనువు - చులకన

ఒక వ్యక్తితో చనువు ఏర్పడిన తరువాత, ఆ వ్యక్తిని చులకన చేస్తామా లేక చేరదీసి అభిమానం పంచుతామా అనేది మన మానసిక స్తాయిని, మన జీవితం యొక్క అభివృద్దిని ప్రతిబింబిస్తుంది. 


అందుబాటులో ఉన్న వ్యక్తులను అభిమానించలేక అందని వాటి కోసం ఆరాట పడటమే మన జీవితాలలో ఉండే దౌర్బాగ్యం. కళ్ళు ఉండి చూడలేక, చెవులు ఉండి వినలేక, బుద్ది ఉండి ఉపయోగించుకోలేని దౌర్బాగ్య స్తితిలో ఉండటం ఆధునిక మానవునికి ఉపయోగ పడునా ?  


విమర్శించడం, వాదులాడటం, ఎగతాళి చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే క్లుప్తంగా... ఎందుకంటే ఉన్న నాలుగు రోజులు మంచిని పెంచటమే నా పని.


పోయిన వారిని తిరిగి పొందలేం, ఉన్న వాళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఉన్న వారిని కాపాడుకోవడం మన చేతుల్లో పనే, మన చేతల్లో పనే.