Tuesday, February 26, 2013

వ్యాపార సూత్రం

సినిమా వాళ్ళు వాస్తవ విరుద్ద స్టంట్లు, బూతు కాస్ట్యూమ్స్ చూపించి డబ్బులు సంపాదించటానికి ప్రయత్నిస్తుంటారు. 
అది ఒక వ్యాపార సూత్రం. 

చదువుకున్న వాడికి కాకరయకాయ కీకరకాయ అయినట్లు అది ఒక కళాపోషణ, creativity.


తప్పని సరైతే అవి చూసి మనం కాసేపు సేద తీరాలి కాని వాటిని అనుకరించకూడదు. 

ఏడవటానికి, భయపడటానికి, సమాజాన్ని ఉద్దరించడానికి  సినిమాకి వెళ్ళాల్సిన అవసరం, తీరిక ఎవరికి  ఉంటాయి!!    

అన్ని రంగాల్లోనూ చిల్లర ప్రాబల్యం ఎక్కువ అయింది. 


చిల్లర సంపాదించే మార్గాలు అందరికి లభిస్తున్నాయి కాబట్టి సామజిక అసమానతలు తక్కువ అయ్యాయి.  


విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాయకీయం, ఆద్యాత్మికం  అన్నీ చిల్లర చుట్టూతనే తిరుగుతున్నాయి.   


డబ్బు, గౌరవం సన్నిహితులే కాని, నీతి మాలిన వ్యాపార సూత్రాలు బాగా కనిపెడుతున్నారు; చదువులు ఎక్కువ కాలా మరి. అందువల్ల. 


కౌమార దశలో/ యవ్వన దశలో కోరికలు రేకెత్తించేదే ప్రేమ, అది ఒక నిత్యావసరం అని ప్రచారం చేయించేది చిల్లర వ్యాపార సూత్రం మాత్రమే. 


రెచ్చ గొట్టు, చిచ్చు పెట్టు - ఇది ఒక విజయవంతమైన వ్యాపార సూత్రం, ఏ రంగంలోనైన విచ్చలవిడిగా వాడుకోవచ్చు.  

    
ఎవడి ఉచ్చులోనో పడకుండా, ఎవడిచిచ్చులోనో మాడిపోకుండా తల్లి దండ్రులు బ్రతికించిన ప్రేమను సజీవంగా పెంచ గలిగితే అది గొప్ప విషయం.