Tuesday, May 31, 2011

దేవుడికెందుకు లంచం ?

మా అమ్మ బ్రతికితే నీకు అది ఇస్తా 
నన్ను ప్రేమించే పెళ్ళాం దొరికితే ఇది ఇస్తా 
మా నాన్న నన్ను మగాడిగా గుర్తిస్తే ఇంకేదో ఇస్తా ఇలాంటి ప్రార్ధనలు ఎందుకు ?
ఆహ్ ఎందుకు ?

ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అని మనుషులకు విభేదాలు సృస్టింఛినందుకా 
తెలివి కలవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, పొడుగు వాళ్ళు పొట్టి వాళ్ళు, నల్ల వాళ్ళు, తెల్ల వాళ్ళు అని వెక్కిరించుకోవటానికా ?


ఈ లంచాలు, విభేదాలు సృష్టించింది తెలివితేటలు ఎక్కువై అజ్ఞానందకారంలో కొట్టుమిట్టాడుతున్న మనిషే.

ప్రజాస్వామ్యంలో చట్టమైనా, మతమైనా మనిషి అభ్యున్నతికే, ఆనందానికే, మనుషులు జీవించడానికే.

ఈ విజ్ఞానం సంపాదిస్తే మనిషికి ఆనందమే.