Saturday, February 2, 2013

జీవితం వేరు, నాటకం వేరు

నాటకం కల్పితం. ఇతరుల పాత్రలను పోషించటం, ఇతరుల భావాలను పలకటం, ఇతరుల బాద్యతలను వెలి బుచ్చటం నాటకం, కల్పితం.

మన భావాలను తెలపటం, మన బాద్యతలను వాస్తవికంగా నిర్వర్తించటం జీవితం.

మన బాద్యతలు మన కుటుంబం నుంచే మొదలవుతాయి - ఎందుకంటే మన తల్లి దండ్రులు ఎంతో ఇష్టంతో, ఎంత కష్టమైనా భాద్యతగా భరిస్తూ మనకు ఈ జీవితాన్ని ఇచ్చారు. కాబట్టి అందులో కొంతైనా తిరిగి ఇవ్వటం ప్రతి వ్యక్తి  యొక్క కనీస ధర్మం. ఊర్లో వాళ్ళ కోసం, దేశంలోని వాళ్ళ కోసం అనేవి విశాల దృక్పదంతో నిర్వర్తించే బాద్యతలు.  

మన జీవితం కచ్చితంగా ఏ సినిమాలోనో, ఏ పుస్తకం లోనో ఉండదు; అది మనకి మనం కృత నిశ్చయంతో, కుతూహలంతో, నిబద్దతతో నేర్చుకోవలసిన విజ్ఞానం.