అంటే ఆ యువ రాజా వారికి విద్య ఉన్నట్టా;
ఏ విషయమైతేనేమి వారిని మనిషి అని ఈ భూలోకంలో ఎవరైనా మనుషులు అందురా ?
వాడి విద్య, వంశం, బలం, తెలివితేటలూ, ధనం, అందం, అధికారం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ?
ఎవరి ఆభిప్రాయం వారికి ఉంటుంది నేను కాదనను; కాదన్నా వరిగేది ఏది ఉండదు కాబట్టి.
ఇలా తుపాకీ తూటాలతో కాకపోయినా మాటల తూటాలతో, ప్రవర్తనతో హింస పెట్టే వాళ్ళు మనకి చాల మంది తారస పడుతుంటారు.
కాబట్టి మంచి ప్రవర్తన ఉన్న వాడిని మనిషి అంటారు. మంచి ప్రవర్తన లేని వాడినే వింత పశువు అంటారు.
అదే విద్యాధికుడి యొక్క ముఖ్యమైన లక్షణం. దీని తరువాతనే ఏ విద్యలోనైనా ప్రావీణ్యత.
కాబట్టి రాజ వంశంలో పుట్టినా, పండిత వంశంలో పుట్టినా, పూరి గుడిసెలో పుట్టినా, .......అదన్నమాట.
మన తోటి వారు ఇబ్బంది పడకుండా ప్రవర్తించటం, వారికి మంచి చెయ్యటానికి ప్రయత్నించటమే మన ముందు ఉన్న లక్ష్యం - ఆ మంచి చెయ్యటానికే ఈ చదువు.
అంతేకాని వేరే వాళ్ళకి చదువు రాదు, ఇతరులు చేతకాని వాళ్ళు అని నిరూపించటానికి కాదు.
ఆ మంచి చెయ్యటానికే ఈ టెక్నాలజీ.
ఆ మంచి ప్రవర్తనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్.
విశ్వ విద్యాలయ పట్టాలు లేక పోయినా ఎన్నో జీవితాలకు, ఎన్నో కుటుంబాలకు, మేలు చేసే వాళ్ళను మనం చూస్తున్నాం.
ఈ విశ్వమే ఒక విద్యాలయం. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న తపన, కుతూహలమే, మనిషిని మనిషిగా బ్రతికిస్తుంది, గొప్పవాణ్ణి చేస్తుంది.
మన మనసులో మంచి ఉందా, ఇతరుల మంచి కోరుకునే గుణం, స్వభావం ఉందా లేదా అనేదే ముఖ్యం.
"ఎదురుగా కనిపించే మనిషినే ప్రేమించలేని వాడివి, కనిపించని దేవుడిని ఎలా ప్రేమించ గలవు" - మదర్ తెరెసా .
ఇంత కన్నా గొప్ప చదువు ఉందా చెప్పండి ?