Sunday, July 3, 2011

అధ్యాపకుని ఆనందం

(Happiness of Teacher)


ఈ సమాజంలో ఒక అద్యాపకునికి చాలా పెద్ద బాద్యత ఉంది. 

ఒక కుటుంబంలో తల్లి, తండ్రికి ఆ కొద్ది సంతానం మీద ఉండే బాద్యత చాలా గొప్పది
అది ఇంకెవరూ కూడా బర్తీ చేయలేని, నిర్వహించలేని ఆనందకరమైన బాద్యత.

అలాగే ఈ ప్రపంచం అనే విశ్వ మానవ కుటుంబంలో అద్యాపకునికి కూడా జ్ఞానాన్ని ఆర్జించి, పంచే ఆనందకరమైన బాద్యత ఉంది.

ఎందుకంటే జ్ఞానమే దైవం; జ్ఞానమే జీవితాన్ని జీవింపజేస్తుంది కాబట్టి. బయటి ప్రపంచ జ్ఞానం కన్నా అంతర ప్రపంచ జ్ఞానం చాలా ముఖ్యం. ఒకరికి తీపి ఆనందాన్నిస్తే, ఇంకొకరికి కారం ఆనందాన్నిస్తుంది. బయటి ప్రపంచంలో ఎందులో తీపి ఉంటుందో ఎందులో కారం ఉంటుందో తెలుసుకోవడం మనం సంపాదించవలసిన జ్ఞానమే.

అజ్ఞానం జీవితాన్ని అంతం చేస్తుంది. నా అంతం నేను ఎన్నోసార్లు అనుభవించిన జ్ఞానంతో మాత్రమే ఈ విషయం అవగతమైంది.

కుతూహలం, ఉత్సాహం జ్ఞాన సముపార్జనకు ఇంధనం.
ఈ ఇంధనాన్ని సంపాదిస్తూ, నష్టపోకుండా కర్చు చేస్తూ జ్ఞానాన్ని ఆర్జించడమే ఈ జీవిత లక్ష్యం.


ఈ సమాజంలో అనుభవ జ్ఞానాన్ని పంచి, ఆనందాన్ని, జీవిత పరమార్ధాన్నిసాదించుటకు ఒక మనిషికి ఉన్న ఏకైక మార్గం మన యువ కెరటాలు.

వారు ఇచ్చే గౌరవం కల్మషమైన బుద్ది కర్మాగారాలు వెదజల్లే వాయువుల కన్నా స్వచ్ఛమైనది, సజీవమైనది.

ఒక అద్యాపకుడు తనకున్న పరిధిలో తన బాద్యత నిర్వర్తించడానికి విద్యార్దులు ఇచ్చే గౌరవం సరిపడా ఇంధనం ఇస్తుంది.

ప్లాస్టిక్ కవర్లను నిషేదిద్దాం, విద్యార్దుల ఉత్సాహాన్ని, జ్ఞాన తృష్ణని కాపాడుదాం, సంరక్షించుదాం, పెంచి వృద్ధి చేద్దాం.

ఎందుకంటే నేటి అధ్యాపకులు, నేటి తల్లిదండ్రులు జీవించవలసింది నేటి విద్యార్దులు సృష్టించబోయే రేపటి ప్రపంచంలోనే. 


ఈ సమాజంలో చెడ్డ వాళ్ళు వినాశనం చేస్తున్నారు అనుకున్నప్పుడు, మరి మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ?


నేను మంచి వాణ్ణి అనుకున్నప్పుడు సంఘ విద్రోహులు తప్ప మిగతా అందరూ మంచి వాళ్లేగా అని అనిపిస్తుంది. 
ఈ సమాజంలో ఉన్న మంచి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి. ఈ సమాజంలో ఉన్న చెడు నాలో వినాశనకారి ఆలోచనలు కలిగిస్తున్నాయి కాబట్టి.   

సంఘ విద్రోహులు అంత చక్కటి సమన్వయంతో అభివృద్ధి సాధిస్తున్నప్పుడు మరి మంచి వాళ్ళం అనుకునే వాళ్ళు ఇంకెంత సమన్వయంతో పని చేయాలి ? నేనొక్కడినే మంచి వాణ్ణి, నేనొక్కడినే పనితనం తెలిసినవాణ్ణి, మిగతా వాళ్లంతా  వృధా గాళ్ళు అనుకుంటే సమన్వయం సాధించగలమా ? ఏమో !!   

సంఘ విద్రోహ శక్తులను పాతి పెట్టే శక్తి లేకనే ఈ ఆశయం యొక్క ఈ ప్రయాస - ఇది ఒక నిజం. 

వాళ్ళు నా కొడుకులు కాదు. ఏ అజ్ఞానపు పేద తల్లి కన్న కొడుకులో మరి. తెలీదు.
ఈ అజ్ఞానమే మన శత్రువు. మనుషులు కాదు. ఇది ఒక నిజం.

No comments: