Saturday, October 8, 2011

నేనెవ్వరిని ప్రేమించలేను; నేనెవ్వరిని ద్వేషించలేను


నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు అని పాడుకోలేను. 

నన్ను నేను ప్రేమించుకుంటూ ఉంటే ప్రతి ఉదయం, ప్రతి రోజు ఒక ఆశను మోసుకొస్తుంది అనే ఆశ నాకు ఉంది, అది ఒక నమ్మకం స్తాయికి చేరింది మరి.

ఈ ప్రపంచంలో ఎంతో మంది వెదవలు ఉన్నారు; నేను పరమ చెత్త వెదవను అయ్యాను. 
ఈ ప్రపంచంలో ఎంతో మంది అమాయకులు ఉన్నారు; నా అమాయకత్వానికి, చేతకాని తనానికి చింతించని రోజు లేదు.

కానీ ఇన్ని దశాబ్దాల కాలం తరవాత నేను ఎదిగాను, నా ఆనందానికి, నా దుఖాలకి కారణాలను కనుగున్నాను; ఈ ప్రపంచంలో నాకోసం ఎవ్వరు చెయ్యలేని, చెప్పలేని విషయాలను కనుగున్నాను.  
బాహ్య ప్రపంచ జ్ఞానం - అంతర ప్రపంచ జ్ఞానం, రొండిటినీ సమన్వయ పరుచుకుంటూ ప్రయానించడమే మనం చేయగలిగినది. 

మనకు ఏం కావాలో మనకు తెలియాలి; 
ప్రపంచానికి ఏం కావాలో కూడా మనకే తెలియాలి; తెలిస్తేనే కదా ఏం చేయాలో, ఏం చేయగలమో అనేది తెలుస్తుంది. 

ఉపయోగ పడే పనులు ఏమైనా చేస్తేనే కదా ప్రేమిస్తున్నాం అనే భావన కలిగేది. ద్వేషించడం వల్ల ఒక్క ఉపయోగం ఉందా ?