Tuesday, December 25, 2012

మనిషిగా పుట్టిన ఓ మనిషి

మనిషిగా పుట్టిన ఓ మనిషి బ్రతకాలి నువ్వు మనిషిగా - మానవత్వంతో

మనిషిగా పుట్టిన ఓ మనిషి; తోటి మనుషులు నీకు మనుషులుగా కనిపించుట లేదా ?

 నీ కళ్ళ అందఃత్వమా లేక జ్ఞాన అందఃత్వమా ?

ఇతరుల ఇబ్బందులను నువ్వు విస్మరించగలవు కానీ ఇతరుల ఆనందాన్ని, క్షేమాన్ని నువ్వు భరించలేవా ?


కుటుంబం, సమాజం - ఇలా నలుగురిలో ఒకడిగా పుట్టిన నువ్వు నలుగురిలో ఒక్కడిగా నీ భావాలను వ్యక్తీకరించలేవా - ఇతరుల క్షేమమే నీ క్షేమం అని భావించలేవా ?


అలాంటి ఆలోచనలు, 
అలాంటి భావ వ్యక్తీకరణ,  అలాంటి పనులు నువ్వు చెయ్యలేవా ?

అలా చెయ్యగలిగినన్ని రోజులు నువ్వు మనిషిగా జీవించగలుగుతావు.




మన పుట్టుక మన బలం తోనో, మన బలహీనతతోనో, కోరికతోనో,  ప్రణాళికతోనో, మన అవసరంతోనో, మన భావావేశం తోనో జరగదు - పూర్తిగా మన ప్రమేయం లేకుండానే పుడతాము - ఒక్క క్షనం కూడా మన ఆలోచన, ఊహ లేకుండా జరిగి పోతుంది !!


కాని; నేను పలానా, నేను ఇలా పుట్టాను, ఇందు వళ్ళ పుట్టాను, వీళ్ళకు పుట్టాను, నేను ఇంత మందికి ఇబ్బంది కలిగించాను, ఇంత మందికి భారం అయ్యాను, ఇంత మందికి ఉపయోగపడ్డాను అనేది తెలియడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు.


ఒక డాక్టర్ని అతని వస్త్ర ధారణ వల్ల గుర్తించడం జరుగుతుంది.
అలాగే ఒక పోలీస్, సైనికుడు, రైతు, ఉద్యోగి వాళ్ళ వృతి అవసరాలననుసరించి వస్త్ర ధారణ ఉంటుంది. 
ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల ననుసరించి బయటి సమాజంలో వస్త్రధారణ చెయ్యరు.  
అలాగే ఒక స్త్రీ, తల్లిగా చెల్లిగా చూడబడాలి అనుకునేప్పుడు అలాంటి వస్త్ర ధారణతోనే  బయటికి వస్తుంది. 

అంతర్ముఖం ( inside out)


నేను  ఏ స్త్రీకి గాని, పురుషుడికి గాని జీవన్మరణ సమస్యకు దారితీసే లేక తత్ సమానమైన ఆలోచనలు, పనులు చేసుంటే ఆ క్షణమే నా జీవితం తీసేసుకోండి.

అబ్యర్దన:
శారీరక వాంఛలు ఉద్రేక పరచే విధంగా మాత్రం వస్త్రధారణ చేసి నా కాలాన్ని వృధా చేయొద్దు.

శారీరక వాంఛల మీద ఆశలు రేకెత్తించి, నిరుత్సాహ పరచి, జీవితం మీద ఉన్న ఆశలను చిద్రం చెయ్యటమేన నీ ఉద్దేశమా అని అడుగుతున్నాను - వ్యామోహం రేకెత్తించే వస్త్ర ధారణ చేసే స్త్రీని.


No comments: