Wednesday, March 28, 2012

అమ్మకే అబద్రత కలిగించే అభివృద్ధి ఉంటుందా !?

ఉన్న జీవులను, జీవితాలను కాపాడుకోవడమే తెలివితేటలంటారు - కొత్త అవిష్కరణాలు, కొత్త ఆశలు - కొత్త దేవుళ్ళు ఎరుగు.
చాలా మంది కొత్త దేవుళ్ళు వచ్చారు ఈ మద్య; ఆ జిల్లాలో, ఆ ఊర్లో... పలానా దేవుడు కోరుకున్నవన్నీ ఇస్తాడంట... వెళ్దామా మరి ? - మనం ఏమి ఇచ్చుకోవాలో ముందు !!!!!!


మనం ఏమీ ఇవ్వకుండానే, ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చేదే అమ్మ.
తన జీవితాన్నే పణంగా పెట్టి మనకు జీవితాన్ని సృష్టించేదే అమ్మ.


మనసు నిండా ఒకే  భావన, ఒకే ఆలోచన ఉందా? అంటే - అది తన బిడ్డలను, తన వాళ్ళను కాపాడుకోవాలనే భావన, ఆలోచన - అదే అమ్మ మనసు.


నీ జీవితం నీది కాదు, తనది; అని తపించే తాపత్రయం ఒక్కటే.
అలాంటి అమ్మ మనసుని కాపాడాలి అనిపిస్తే సంరక్షించొచ్చు,
లేకపోతె చిల్లర పైసలను లెక్కించొచ్చు.


ఈ స్వతంత్ర్య భారత దేశంలో అందరికి అన్ని అవకాశాలు ఉన్నాయి 
బాద్యతలు నిర్వర్తించడానికైనా బలుపెక్కి బరితెగించడానికైనా. 


వివేకం మన సొంతమైతే ఆనందం మన సొంతమౌతుంది; వివేకానందం మన సొంతమౌతుంది.
లేని పక్షంలో అంతా విషాదమే.


అమ్మ భద్రం - బిడ్డ బద్రం - అభివ్రుది బద్రం. ఇదే మన మంత్రం. ఇదైతే పక్కా... ఫైనల్ అన్నట్లు.


పురుషిడి అస్తిత్వం ఈ అమ్మతనాన్ని అర్ధం చేసుకోవడంలోనే ఉంటుంది తప్ప వేరే దేనిలో ఉండదు. 


ప్రతి పురుషుడు కోరుకునేది ఈ అమ్మ తనాన్నే; కాపాడే, సంరక్షించే స్వభావాన్నే.


ప్రేయసి రావొచ్చు ప్రేయసి పోవొచ్చు, పురుషుడు పులకించొచ్చు, పురుషుడు విలపించొచ్చు. కాని అమ్మతనం; కాపాడే తనం ఎపుడూ శాశ్వతం - మనసు అనే ఈ సృష్టిలో.     


అందుకే బాషకైనా, దేశానికైనా అమ్మతనాన్ని ఆపాదించేది. 


పురుషుడిగా పుట్టావా లేక స్త్రీగా పుట్టవా అనేది ప్రశ్నకాదు,
ఆ జాతిలో పుట్టవా లేక ఈ జాతిలో పుట్టావా అనే సంకుచిత సమాజపు ప్రశ్న సమస్య కాదు,
మనసు ఉందా లేదా ?
మనషులు అంటే ఇష్టమా? బండ రాళ్ళు, బంగారం, వస్తువులు అంటే ఇష్టమా ?


దేవుడు అంటే ఇష్టం ఐతే చాలా మంది బాబాలు ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు. 
మనుషులు అంటే ఇష్టం ఐతే మన జీవితంలో చాలా మంది మంచి మనుషులు కనిపిస్తారు; మనసుతో చూసినప్పుడు :-)   


మనసు ఉన్నంత వరకు మెదడు ఉన్నంత వరకు కావలసినవి, నచ్చినవి చెయ్యడమే - రొండో ఆలోచన అవసరం లేదు;
ఎందుకంటే పగిలిన తరవాత ఏమీ చెయ్యడానికి ఉండదు కాబట్టి - ఇపుడైనా, ఎపుడైనా.


అమ్మని పురుషుడు కాపాడుతున్నాడు కాబట్టి అమ్మ కడుపులోనైనా, ఈ విద్యా ఆలయం లో నైనా పెరుగుతున్నాం.   


పైసలు తీసుకుంటున్నా కాబట్టి - తెలిసినది చెప్పాలి కాబ్బట్టి ఈ సోది అంతా చెప్పాల్సి వస్తుంది !
పైసలు లేక పొతే ప్రాణికైనా, ప్రాణం లేని శవానికైనా ఏ దేవుడు, మనిషి విలువ ఇస్తాడు ! కదా ?  


పిండావులే గుండె; బొబ్బో బిడ్డా :-).

No comments: