ఈ సమాజం మనకు ఏమి ఇచ్చింది ?
ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కో వ్యక్తికీ ఒక్కోలా ఉంటుంది.
కాని ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వగలం అనేది మాత్రం చాల ముఖ్యమైన ప్రశ్న.
సమాజానికి మంచి చేసిన వాళ్ళకు తప్పకుండ ఈ సమాజం గౌరవం ఇస్తుంది .
కాకపోతే ఈ సమాజం వెంట పడాలి, దాన్ని ఆకర్షించాలి, మనం చేసేది మంచి అనేది దానికి అర్ధం కావాలి,
అప్పుడు ఈ సమాజం మన తోడు ఉంటుంది.
చిన్న చిన్న మంచి పనులు రోజూ చెయ్యవచ్చు, కానీ పెద్ద పనులు చెయ్యాలంటే ఒక యుద్ధం లాంటిదే అని అనిపిస్తుంది.
మంచి చెయ్యాలంటే చాలా కష్టం, చెడు చెయ్యాలంటే క్షణం కూడా పట్టదు, చాలా సులువు. కొంచం విచిత్రంగానే తోస్తుంది.
ఎన్నో అడ్డంకులు, నిరుత్సాహ పరిచే అవమానాలు. ఎందుకో ఏమో...
ఏదో గజి బిజిగా, గజి బిజిగా తోస్తుంది..
రోజు తడబడుతూ ... తడబడుతూ...
రోజు తడబడుతూ ... తడబడుతూ...
రామానుజం లా బ్రతకడం కష్టం అయినప్పుడు అపరిచితుడిలా మారాలేమో ! ఏమో !
No comments:
Post a Comment