Wednesday, February 15, 2012

బంధం - బలం

పుట్టి బుద్ది ఎరిగాక ఆ బుద్దికి బలం చేకూర్చుకోవడానికి బంధాలు ఏర్పరచుకోవాలి.
ఐకమత్యమే మహా బలం అన్నారు తప్ప, వ్యామోహాలు, ప్రలోభాలు, తాత్కాలిక ప్రయోజనాలు బంధాలకు మూలం కాజాలవు.

దొంగ బుద్ది కలవాడు, అలాంటి బుద్ది కలవారితో చేతులు కలిపి తన తప్పుడు కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తాడు.
కానీ మంచి బుద్ది ఉంది అనుకునే వారు మాత్రం చేతులు కలపడం మాని నాదే పైచేయి కావాలి అని ఆరాట పడుతూ ఎటూ కానీ వారిగా తయారవుతున్నారు.

ఒక బంధం బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు.
అలా బలమయ్యే బంధాలనే ఎన్నుకునే స్వాతంత్ర్యం ప్రతి మనిషికి ఉంటుంది. జీవితమనేది జీవించడానికే తప్ప, అప్రయోజనమైన, నిరుపయోగమైన వాటి కోసం జీవితాన్నే త్యాగం చేయాల్సిన దౌర్బాగ్యం మనిషికి లేదు.