Friday, October 21, 2011

అమ్మ అమాయకత్వం


అమ్మకే తెలియదు ఎందుకు మాతృత్వం తనకు కలిగిందో. తన సృష్టి యొక్క ప్రతిఫలం ఏమిటో అని.
కానీ అమ్మకు తెలుసు మాతృత్వం ఎంత ఆనందమో, ఎంత మధురమో, ఎంత శ్రమతో కూడుకున్నదో, తన జీవితాన్నే త్యాగం చేయగల ఆనందం అందులో ఉందని. 

సృష్టించే ఉత్సాహం, నమ్మకం కలవారిని నిరుత్సాహ పరచకుండా ఉంటే చాలు అని అనిపిస్తుంది.
మానవత్వాన్ని, మానవాళికి ఉపయోగ పడే విజ్ఞానాన్ని ఆవిష్కరించే ఉత్సాహాన్ని మనం ఎందుకు నిరుత్సాహపరచాలి ? అవసరమా ?
అంత అమాయకత్వం అవసరమా ?

మనిషి తను సృష్టించిన దానికి తనే బానిస అవటం విజ్ఞానమా ? మరి ఏంటి విజ్ఞానం ? 

క్షనికా'వేషాలు', క్షణిక సుఖాలు ఏం సృస్తిస్తున్నామో ఏం నాశనం చేస్తున్నామో చెప్పవు, మనకు ఏం కావాలో కూడా తెలుపవు.
కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎప్పుడు చేస్తున్నామో అని ఆలోచించుకోవాలి; ఎందుకంటే ఒక ఆలోచనే నిర్మాణానికైనా, వినాశనానికైనా మూలం.
ఒక్కడి ఆలోచనతోటి ఏది కూడా నిర్మాణం కాదు, నలుగురు కూడబలుకుంటేనే అది సాధ్యం. కాబట్టి ఆవిదమైనటువంటి అలచోనలు కలవారిని సంపాదించడం, వారిని కాపాడుకుంటూ మన ఆశయాన్ని నిర్మించుకోవడమే మనం చేయగలిగినది తప్ప మరి ఏ ఇతర మార్గము లేదు. 


ఇకమత్యమే కదా మనిషికి బలం, విడిపోతే విషాదమే కదా... నేస్తమా ? 
Oh... My Friend.