Monday, January 2, 2012

ఆనందం = అభివృద్ధి @ కొత్త సంవత్సరం ౨౦౧౨

ఆత్మవంచన (hypocricy) లేని జీవితాన్ని కోరుకుంటున్నాను .
మనసు చంపుకుని శరీరాన్ని జీవింపజేయాలని కోరుకోవట్లేదు.
అభిమానాన్ని, గౌరవాన్ని చంపుకుని శరీరాన్ని జీవింపజేయాలని కోరుకోవట్లేదు. 

మనస్పూర్తిగా పని చేయాలని, ఎన్ని క్షణాలు, రోజులు, సంవత్సరాలు ఆ విధంగా వీలయితే అన్ని క్షణాలు జీవించాలని కోరుకుంటున్నాను. 
మనస్పూర్తిగా ఇతరులను గౌరవించాలని, అభిమానించాలని కోరుకుంటున్నాను. 

నా చుట్టూ ఉన్న పెద్దలను, పిల్లలను, తోటి వారిని మనసుతో చూస్తే ఇలా అసలు విషయం చెప్పక తప్పటం లేదు.

కొన్ని వాస్తవాలు నా తోబుట్టువులు దూరం కావటానికి కారణం అయ్యాయి.
కొన్ని వాస్తవాలు నా జీవితాన్ని చివరి వరకు తీసుకెళ్ళాయి - కేవలం కుతూహలంతో (ఆశావహ దృక్పదంతో, నిర్మాణాత్మక ధోరణితో)  ఆ వాస్తవాలను గ్రహించగలిగాను - అవి గౌరవం, అభిమానం, ప్రేమ. 

విద్యను చిల్లరతో కొనగలను అనే అహంభావంతో ఉన్న వాళ్ళలో లేనిది, విద్యను వినయంతో సాధించగలను అనే అణకువ ఉన్నవాళ్ళలో ఉండేదే ఉత్సుకత.

విద్యను అర్దించు వాడు విద్యార్ది తప్ప, కొనుగోలుదారుడు విద్యార్ది కాజాలడు - ఎందుకంటే విద్య అంగట్లో దొరికే సరుకు కాదు మరి - కొని, వాడి, పడేయటానికి - ఎంతో ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే తప్ప విద్య (వాస్తవాలు గ్రహించటం) అబ్బదు.     
మరి ఆ విద్యను అధ్యయనం చేసిన అధ్యాపకుడికి ఆ జ్ఞానం పంచడంలోనే ఆనందం, తృప్తి ఉంటుంది, విద్యార్ది ఉన్నతిలోనే ఉంటుంది - మరి ఏ ఇతర అంశంలోనూ ఉండదు.  


అద్యాపకుడు తను భోదించే subject ని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది. 
కనీసం విద్యార్దిని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది.

కుటుంబం ఎవరిదైనా కుటుంబమే, 
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే,
మనసు ఎవరిదైనా మనసే.
ప్రేమ ఎవరిదైనా ప్రేమే.

కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సాద్యం అయినంత వరకు గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమని పంచటమే ఉత్తమమని నాకు అర్ధం అయింది.
చేతలలో కూడా చెయ్యాలి, అప్పుడే మనసు కుదుట పడుతుంది - అదే ఈ ప్రయత్నం. 

ఆనందం = అభివృద్ధి @ కొత్త సంవత్సరం ౨౦౧౨
నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు; గ్రహించేవాళ్ళు గ్రహిస్తారు.  

Happiness = Prosperity @ New Year 2012
Those who ridicule will ridicule, those who realize will realize. 

Old Ambition in yet another New Year.